రామయ్యకు ఘనంగా అభిషేకం | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు ఘనంగా అభిషేకం

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం అభిషేకం జరిపారు. అనంతరం మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

కనుల పండువగా నదీహారతి

భద్రాచలంటౌన్‌: భద్రాచలం వద్ద గోదావరికి ఆదివారం నదీహారతి ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. స్వామివారికి 12 సార్లు, గోదావరి మాతకు 21 సార్లు హారతి ఇచ్చినట్లు అర్చకులు తెలిపారు.

పెద్దమ్మతల్లికి

విశేష పూజలు

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీ కనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం జిల్లా నలుమూలలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్‌ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ విజయ్‌కుమార్‌, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.

ప్రశాంతంగా

ఫిట్టర్‌ రాత పరీక్ష

రుద్రంపూర్‌: సింగరేణి సంస్థలో ఫిట్టర్‌ కేటగిరీ–1 విభాగంలో ఖాళీగా ఉన్న 96 పోస్టుల భర్తీకి ఆదివారం సింగరేణి మహిళా కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 84 మంది అభ్యర్థులకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 72 మంది హాజరుకాగా, మిగిలిన 12 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో పర్సనల్‌ రిక్రూట్‌మెంట్‌ సెల్‌ విభాగం ఏజే మురళీధర్‌రావు, విజిలెన్స్‌ విభాగం జీఎం ఎస్‌వీ మురళీధర్‌రావు పర్యవేక్షించారు. ఆదివారం రాత్రి సింగరేణి వెబ్‌సైట్‌, సింగరేణి ప్రధాన కార్యాలయం మెయిన్‌ గేట్‌ వద్ద నోటీస్‌ బోర్డులో ఫలితాలు అందుబాటులో ఉంచుతామని రిక్రూట్‌మెంట్‌ సెల్‌ విభాగం జీఎం తెలిపారు. ఏజీఎం పర్సనల్‌ పి.వేణుగోపాలరావు, బి. సమ్మయ్య, డి. నాగేశ్వరరావు, ఎండీ గౌసుద్దీన్‌, సింగరేణి మహిళా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ మంజుల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement