విద్యారంగ పరిరక్షణకు కృషి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగ పరిరక్షణకు కృషి

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

చుంచుపల్లి: ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు యూటీఎఫ్‌ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి అన్నారు. డిసెంబర్‌ 26, 27, 28 తేదీల్లో కొత్తగూడెంలో సంఘం రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కొత్తగూడెంలోని శ్రీరామ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు బి.మురళీమోహన్‌ అధ్యక్షతన ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభలను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు, సంఘం నాయకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ మూడ్‌ గణేష్‌, డిప్యూటీ మేయర్‌ లలిత కుమారి, మచ్చా వెంకటేశ్వర్లు, ఎస్‌కేసాబీర్‌ పాషా, కోనేరు పూర్ణచంద్రరావు, బి రాజు, విద్యానగర్‌ సర్పంచ్‌ భూక్య శాంతి శ్రీ, విద్యానగర్‌ ఉప సర్పంచ్‌ వాసిరెడ్డి మురళి, నాయకులు రామారావు, వెంకట పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement