నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

బూర్గంపాడు: ఏజెన్సీ ఏరియాలోని గిరిజన రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రమే ఆయన జిల్లాకు చేరుకోగా, బీపీఎల్‌ గెస్ట్‌ హౌస్‌ వద్ద ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌ రాజ్‌, ఇతర అధికారులు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.

నేటి ప్రజావాణి రద్దు

కొత్తగూడెంఅర్బన్‌: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మ న్‌, ఐదుగురు సభ్యుల బృందం సోమవారం జిల్లాలో పర్యటించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీలు, భూ సమస్యలు, ఆర్‌ఓఆర్‌ అమలు తదితర అంశాలపై జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ అంకిత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించేందుకు కలెక్టర్‌ కార్యాలయానికి రావద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement