చుంచుపల్లి: జిల్లాలో అటవీ, నీటిపారుదల శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులకు వేగం చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ అన్నారు. అటవీ, నీటిపారుదల శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై పరస్పర సమన్వయంతో చర్యలు చేపట్టేందుకు శనివారం కొత్తగూడెం వనవిహార్ ఫారెస్ట్ కాంప్లెక్స్‌లోని జిల్లా అటవీ అధికారి కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన చర్యలు చేపడుతున్న సమయంలో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బందితో పాటు నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి, భద్రాచలం ఎస్‌ఈ మహేశ్వరరావు, సిబ్బంది కృష్ణ, జానీ, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్


