గిరిజన యువతకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజన యువతకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

వైరా/ములకలపల్లి: గిరిజన ప్రాంతాల్లోని యువతీ యువకులు పోలీసు ఉద్యోగ నియామకాల్లో 75 శాతం రిజర్వేషన్లు కలిపించాలని వైరా, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు మాలోత్‌ రాందాస్‌ నాయక్‌, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వ ర్లు కోరారు. ఈ సందర్భంగా వారు శనివారం హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గిరిజన యువతకు భరోసా కల్పించేలా రిజర్వేషన్లు పెంచాలని, భౌగోళిక, సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. అలాగే, ములకలపల్లిలో బాలికల ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement