గ్రామ సమాఖ్య భవనాలు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామ సమాఖ్య భవనాలు పూర్తి చేయాలి

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

జూలూరుపాడు: గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. శనివారం జూలూరుపాడు మండలం వినోభానగర్‌ గ్రామ పంచాయతీలో పర్యటించారు. గ్రామ పరిసరాలు, వీధులను పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త, శానటరీవేస్ట్‌, హానికరమైన చెత్తను సేకరించాలనిసూచించారు. గ్రామ సమాఖ్య భవనాన్ని పరిశీలించి, నాలుగు వారాల్లో పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమికోన్న పాఠశాలలో ఇంకుడు గుంతను పరిశీలించారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో జూలూరుపాడు ఎంపీఓ తులసీరామ్‌, సర్పంచ్‌ గంగావత్‌ నవీన్‌, పంచాయతీ సెక్రటరీ లక్ష్మణ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement