హైకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా విష్ణువర్ధన్‌ | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా విష్ణువర్ధన్‌

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

భద్రాచలం: బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పత్తి విష్ణువర్ధన్‌ రెడ్డి హైకోర్టు డిజిగ్నేటెడ్‌ సీని యర్‌ న్యాయవాదిగా నియమితులయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు ఈ హోదాను పొందిన రెండో వ్యక్తి ఆయనే. గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టుకు అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాపిక్యూటర్‌గా పనిచేశారు. బార్‌ కౌన్సిల్‌ అఫ్‌ ఇండియా మెంబర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ న్యాయవాదుల సమస్యలు, హక్కులు, సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో చురుకై న పాత్ర పోషించారు.

పాదయాత్రకు మద్దతు

కొత్తగూడెంఅర్బన్‌: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి తిరుపతి వెంకటేశ్వరస్వామి క్షేత్రం వరకు భక్తులు సుమారు 600 కిలోమీటర్ల మేర ‘భద్రాద్రి రాముడు టు గోవిందుడు’ పాదయాత్ర చేపట్టారు. వీరికి జిల్లా సరిహద్దులో మేయర్‌ మూడ్‌ గణేష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా మద్దతు తెలిపారు. సమాజ హితం కోసం రోజుకో చెట్టు నాటుతూ యాత్ర సాగించడం అభినందనీయమని అన్నారు. త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్లు గొల్లపూడి వీరేంద్రచౌదరి, వై. వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ మురళి, సనత్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐకేపీ కార్యాలయంలో ఆడిట్‌

పాల్వంచరూరల్‌: ఐకేపీ కార్యాలయంలో శని వారం రాష్ట్ర కమ్యూనిటీ బేస్డ్‌ ఆర్గనైజింగ్‌ అధి కారి (సీబీఓ) వీరస్వామి బృందం ఆడిట్‌ చేసింది. స్వయం సహా యక సంఘాల అభివృద్ధికి మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఐకేపీ కార్యాలయాల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. వ్యవసాయ యంత్ర పరికరాలను అందించగా, వాటిని సన్న, చిన్నకారు రైతులకు అద్దెకు ఇస్తున్నారు. అద్దె వసూలుతో వస్తున్న నగదును సంఘాలు అభివృద్ధికి వినియోగించుకుంటున్నారు. పాల్వంచ ఐకేపీ సెంటర్‌లో 2023లో కొనుగోలు చేసిన 25 తైవాన్‌ పవర్‌ స్పేయర్లు, 10 ఆయిల్‌ ఇంజన్లు, స్పింక్లర్లు, పైపులను తనిఖీచేశారు. పది తైవాన్‌ పవర్‌ స్ప్రేయర్లు పనిచేయడంలేదని గుర్తించారు. నివేదికను సెర్ప్‌ సీఈఓకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

డ్రైవర్‌పై భౌతిక దాడి

దమ్మపేట: ఓవర్‌ టేక్‌ చేసేందుకు దారి ఇవ్వలేదనే నెపంతో ఆర్టీసీ డ్రైవర్‌(కాంట్రాక్ట్‌ ఉద్యోగి)పై భౌతిక దాడికి పాల్పడిన ఘటన మండల పరిధిలోని గణేష్‌పాడు సమీపంలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... సత్తుపల్లి డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు దమ్మపేట నుంచి వయా అప్పారావుపేట మీదుగా సత్తుపల్లికి వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు గణేష్‌పాడు సమీపంలోకి చేరుకోగా. గుడిమెట్ల రామారావు అనే వ్యక్తి టాటా మ్యాజిక్‌ వాహనం నడుపుతూ బస్సును ఓవర్‌ టేక్‌ చేయడానికి ప్రయత్నించాడు. కాగా, దారి ఇవ్వలేదనే నెపంతో బస్సును ఆపి, డ్రైవర్‌ మార్గం శ్రీనివాస్‌పై భౌతిక దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.

పీఆర్‌సీ హామీని నెరవేర్చాలి

కల్లూరురూరల్‌: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ అమలుచేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెరవేర్చాలని పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.రంగారావు కోరారు. కల్లూరులో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగులకు ఇచ్చిన ఏ హామీ అమలుచేయాలని ఆరోపించారు. పీఆర్‌సీ అమలు, డీఏలు, బకాయిల చెల్లింపుతో పాటు సీపీఎస్‌ రద్దుపై నిర్ణయం తీసుకోక ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో నిరాశ అలుముకుందని తెలిపారు. ఈమేరకు రాష్ట్ర స్థాయిలో చేసిన ఉద్యమానికి తలొగ్గి త్వరలో పరిష్కరిస్తామని సీఎం స్వయంగా హామీ ఇచ్చినాకార్యాచరణ రూపొందించలేదన్నారు. ఈ సమావేశంలో పీఆర్‌టీయూ జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు ఆర్‌.బ్రహ్మారెడ్డి, నాయకులు పాకాల రమేష్‌, వెంకటేశ్వర్లు, సురేష్‌బాబు, చెన్నకేశవరెడ్డి, ఎం.డీ.మౌలాలి, షేక్‌ చాంద్‌సాహెబ్‌, టి.సత్యనారాయణరెడ్డి, వీరవల్లి శ్రీనివాసరావు, బోబోలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement