కరకగూడెం: ఓ వ్యక్తిపై వేటకొడవళ్లతో హత్యాయత్నం చేసిన ఘటన కరకగూడెంలో శనివారం జరి గింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వలస ఆదివాసీ గ్రామమైన అశ్వాపురంపాడుకు చెందిన వజ్జ భీమరాజు శనివారం సమీప అటవీ ప్రాంతంలో పశువులను మేపుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేశా ు. తల, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు సమాచారంతో వచ్చిన పోలీసులు భీమరాజును ట్రాక్టర్‌లో గ్రామానికి చేర్చి, అక్కడి నుంచి 108 వాహనంలో మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యంకోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పీవీఎన్ రావు తెలిపారు. కాగా, పాతకక్షల నేపథ్యంలోనే దాడి జరిగినట్లు గ్రామస్తులు చెబు తుండగా, నిందితులు ఎవరనేది పోలీసులు దర్యాప్తులో తేలనుంది. నిందితులు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారనే ప్రచారాన్ని పోలీసులు ఖండించారు.
బంగారు నగలు చోరీ
ఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియా వర్క్‌షాప్‌లో పని చేస్తున్న ఓ అప్రెంటీస్‌కు చెందిన మూడున్నర తులాల బంగారు నగలు చోరీకి గురయ్యాయి. సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన స్రవంతి గత మార్చి నుంచి సింగరేణి ఏరియా వర్క్ షాప్‌లో అప్రెంటీస్‌గా పనిచేస్తోంది. గత ఏప్రిల్ 30న వర్క్‌షాప్‌లోకి వచ్చిన ఆమె తన మెడలోని బంగారు అభరణాలు తీసి హ్యాండ్ బ్యాగులో పెట్టి ర్యాక్‌లో భద్రపర్చింది. కాగా, శనివారం మధ్యాహ్నం మిత్రురాలు వివాహానికి వెళ్లేందుకు బ్యాగు తీసి చూడగా ఆభరణాలు మాయమయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో ఎస్‌ఐ సారంగపాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
కొత్తగూడెంఅర్బన్: కుటుంబ కలహాలతో శనివారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. త్రీటౌన్ సీఐ కథథనం ప్రకారం.. బూడిదగడ్డకు చెందిన పూనం రాజేష్(32), సంధ్య దంపతులు. వీరికి ఐదేళ్ల బాలిక లాస్య ఉంది. రాజేష్ స్థానికంగా కూల్‌డ్రింక్ కంపెనీలో ట్రాలీడ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన రాజేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేష్ చెల్లెలు శైలజ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వలస ఆదివాసీపై హత్యాయత్నం


