జిల్లా పంచాయతీ అధికారి అనూష
అశ్వాపురం/మణుగూరు రూరల్: గ్రామాల పరిశుభత్రకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి అనూష అన్నారు. అశ్వాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మణుగూరు మండలం తోగ్గూడెం, కూనవరం, రామానుజవరం ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు రకాల చెత్తను వేరు చేసే విధానం, ప్లాస్టిక్ రహిత గ్రామం, నీటి పొదుపు, మొక్కల పెంపకం, ప్రకృతి పరిరక్షణ, గ్రామ పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛత సందేశం చేరాలనే ఉద్దేశంతో పాఠశాల నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు డీపీఓ తెలిపారు. స్వచ్ఛత, పచ్చదనం, చెత్త సేకరణ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కొండాయిగూడెం పుష్కరఘాట్ వద్ద వినా యక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మొండికుంట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డులు పరిశీలించి, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆరా తీశారు. డంపింగ్ షెడ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనాలను పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓలు ముత్యాలరావు, శ్రీకాంత్, ఎంపిఓ పి వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు బాణోత్ సదర్‌లాల్, మర్రి సంధ్య, మడకం కృష్ణ, ఏనిక శ్వేత, బాడిశ కల్పన, ఉపసర్పంచ్‌లు తుల్లూరి ప్రకాష్‌రావు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


