సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ
భద్రాచలంటౌన్: ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని భద్రాచలం సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని సబ్‌కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల సమస్యలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.తహసీల్దార్ రవికుమార్, డీటీ బాలకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ రామ్‌నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.


