ఎఫ్‌ఎఫ్‌బీ ధరల భాగస్వామ్యాన్ని సవరించాలి | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎఫ్‌బీ ధరల భాగస్వామ్యాన్ని సవరించాలి

Sep 19 2026 12:22 AM | Updated on Sep 19 2026 12:22 AM

అశ్వారావుపేటరూరల్‌: ఎఫ్‌ఎఫ్‌బీ ధరల భాగస్వా మ్య నిష్పత్తిని సవరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు శుక్రవారం పామాయిల్‌ రైతు సంఘం నాయకుడు మద్దినేని వెంకటేశ్వర్లు(వెంకట్‌) హైదారాబాద్‌లో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం అమల్లో ఉన్న ఎఫ్‌ఎఫ్‌బీ ధరల భాగస్వామ్య విధాన ప్రకారం రైతులకు 75.25 శాతం, పరిశ్రమకు 24.75శాతం వాటా లభిస్తోందన్నారు. కొన్నేళ్లలో తోటల విస్తరణ, సాగునీరు, ఎరువులు, కూలీలు, కోత, రవాణా, మొక్కల సంరక్షణ, ఇతర నిర్వహణ ఖర్చులు పెరి గిన నేపథ్యంలో రైతులకు 80శాతం, పరిశ్రమకు 20శాతం వాటాగా సవరించాలని కోరారు. పామాయిల్‌ టన్ను ధర రూ.25వేలుగా ప్రకటించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement