భద్రగిరి మార్ట్‌పై ప్రశంసలు | - | Sakshi
Sakshi News home page

భద్రగిరి మార్ట్‌పై ప్రశంసలు

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

భద్రాచలంటౌన్‌: గిరిజన ఉత్పత్తులకు మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తూ ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్‌ అభినందనీయమని టూరిజం డైరెక్టర్‌ రంజిత్‌ రాథోడ్‌ కొనియాడారు. గురువారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలోని ఆయన చాంబర్‌లో ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజ్‌ ఆయన్ను కలిశారు. భద్రగిరి మార్ట్‌ను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసే ప్రతిపాదనలను అందజేశారు. ఈ సందర్భంగా రంజిత్‌ మాట్లాడుతూ మార్ట్‌ ద్వారా గిరిజన రైతులు, మహిళా పొదుపు సంఘాల సభ్యులకు మెరుగైన ఉపాధి, ఆదాయం లభిస్తుందన్నారు.కాగా, మార్ట్‌లో మిల్లెట్‌ బిస్కెట్లు, పచ్చళ్లు, ఇప్పపువ్వు లడ్డూలు, తృణధాన్యాలు, జీసీసీ అటవీ ఉత్పత్తులను విక్రయిస్తూ 10 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు ఏపీఓ డేవిడ్‌రాజ్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement