● విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ● ప్రజాపాలన వేడుకల్లో రాష్ట్ర మంత్రి తుమ్మల | - | Sakshi
Sakshi News home page

● విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ● ప్రజాపాలన వేడుకల్లో రాష్ట్ర మంత్రి తుమ్మల

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

● విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ● ప్రజాపాలన వేడుకల్లో రాష్ట్ర మంత్రి తుమ్మల

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అన్ని రంగాలలో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం జరిగిన ప్రజాపాలన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1948 సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో ఒక చిరస్మరణీయమైన రోజని అన్నారు. హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన మహత్తర ఘట్టానికి 78 సంవత్సరాలు పూర్తయిందని పేర్కొన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం, విద్య, వైద్య, ఉపాధి రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సాగునీరు, విద్యుత్‌, మార్కెటింగ్‌, రవాణా సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తున్నామని వివరించారు. సమగ్ర అభివృద్ధికి రహదారి, రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అమరావతి–జగదల్‌పూర్‌ జాతీ య రహదారిని కొత్తగూడెం, భద్రాచలం మీదుగా నాలుగు లేన్లుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, గోదావరి నదీ మార్గం ద్వారా రవాణా అవకాశాలను అభివృద్ధి చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, కలెక్టర్‌ అంకిత్‌, ఎస్పీ రోహిత్‌ రాజు, వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్‌ ఎం.విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఏఓ బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement