వైద్య సేవలను మెరుగుపర్చాలి | - | Sakshi
Sakshi News home page

వైద్య సేవలను మెరుగుపర్చాలి

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి

కలెక్టర్‌ అంకిత్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం యజ్ఞ మహోత్సవ్‌ విరాట్‌ విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌ అంకిత్‌, భద్రాచలం, ఇల్లెందు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య తదితరులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అధికారులు విద్యా చందన, విజయలక్ష్మి, బీసీ సంఘాల నాయకులు కాపర్తి వెంకటాచారి, వారాధి సత్యనారాయణ, నామోజు గోవిందాచారి, ఎలగందుల రామాచారి, అంబుల రామాచారి, బి సాంబయ్య, ఎస్‌ కృష్ణమాచారి, పొడిచేటి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.

చుంచుపల్లి: కొత్తగూడెం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా రూ.67.41 లక్షల విలువైన ఆధునిక వైద్య, ఆస్పత్రి పరిశుభ్రత పరికరాలను గురువారం ప్రభుత్వాస్పత్రికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరికరాలతో మెరుగైన ఐసీయూ, నేత్ర, ఆర్థోపెడిక్‌ తదితర వైద్య సేవలు అందించవచ్చని అన్నారు. అనంతరం కలెక్టర్‌ క్యాజువాలిటీ విభాగాన్ని సందర్శించారు. అత్యవసర వైద్య సేవల్లో జాప్యం చేయొద్దని అన్నారు. ఈసీఐఎల్‌ డైరెక్టర్‌ (పర్సనల్‌) కన్నెన్‌ విఏఎస్‌, అధికారులు పి.వేణుబాబు, సునీల్‌ కుమార్‌, అనిల్‌ కుమార్‌, పూర్ణచందర్‌, సాంబమూర్తి, ప్రభుత్వాస్పత్రి అధికారులు రాధామోహన్‌, సునీత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement