మలేరియా నియంత్రణపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

మలేరియా నియంత్రణపై దృష్టి సారించాలి

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

చర్ల/దుమ్ముగూడెం: మలేరియా నియంత్రణపై వైద్యాధికారులు, సిబ్బంది దృష్టి సారించాలని వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మజ ఆదేశించారు. గురువారం ఆమె చర్ల, దుమ్ముగూడెం పీహెచ్‌సీలను సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. మలేరియా కేసులు, మందులు, అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాజిటివ్‌ కేసులను ఫాలోఅప్‌ చేయాలని సూచించారు. కేసుల సంఖ్య పెరగకుండా యాంటీ లార్వా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని, ప్రతీ శుక్రవారం నిర్వహించే ఫ్రైడే–డ్రైడే నిర్వహించాలని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి చర్ల మండలానికి వచ్చే జ్వర పీడితులను తప్పనిసరిగా పరీక్షించాలని సూచించారు. వైద్యాధికారులు విజయకుమార్‌, శ్రీధర్‌, హారిక, పావని, పూజ, సిబ్బంది శ్రీనివాసరావు, రమాదేవి, కృష్ణయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement