అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

మణుగూరు రూరల్‌ : ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని పినపాక నియోజకవర్గ ఈఆర్‌ఓ, ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సమితిసింగారం గ్రామపంచాయతీలో ఎస్‌ఐఆర్‌ ఓటర్ల నమోదు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మణుగూరు తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశమై నోటీసుల పంపిణీ, విచారణలు, పెండింగ్‌ కేసులు, ధ్రువపత్రాల పరిశీలనపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హుల పేర్లు తొలగించకుండా, అనర్హుల పేర్లు జాబితాలో చేరకుండా చూడాలన్నారు. తహశీల్దార్‌ అద్దంకి నరేష్‌, ఎంపీడీఓ శ్రీకాంత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరావు, సిబ్బంది అనూష, రామారావు తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement