నీటి కుంటల పనులు పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

నీటి కుంటల పనులు పూర్తిచేయాలి

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

పాల్వంచరూరల్‌: నీటి కుంటల పనులను త్వరి తగతిన పూర్తిచేయాలని డీఆర్‌డీఓ పీడీ విద్యాచందన అధికారులను ఆదేశించారు. మండల పరిధి ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచా యతీలో నిర్మిస్తున్న నీటికుంటలను బుధవా రం ఆమె పరిశీలించారు. వర్షాకాలంలో వృథా గా పోయే వర్షపు నీటిని నీటికుంటల్లో నిల్వ చేసుకుని, వర్షాలు లేని సమయంలో పంట లకు వినియోగించుకోవచ్చని అన్నారు. కుంట ల్లో నీరు నిల్వ ఉంటే భూగర్భజలాలు కూడా పెరుగుతాయని, చేపలను కూడా పెంచుకోవచ్చని చెప్పారు. ఏపీడీ రమణ, సర్పంచ్‌ వజ్జ లలిత, ఉపసర్పంచ్‌ రాపోలు రాంబాబు, కార్యదర్శి ఎం.పరశురాం తదితరులు పాల్గొన్నారు.

శ్రీ విద్యకు

బంగారు పతకం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పాండిచ్చేరి లోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరుగుతున్న సౌత్‌ జోన్‌ జూని యర్‌ నేషనల్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ి షిప్‌లో చర్లకు చెందిన శ్రీ విద్య దొర 80 మీటర్ల హార్డి ల్స్‌ విభాగంలో బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ బాధ్యులు కె.మహీధర్‌, సారంగపాణి, వెంకటేశ్వర్‌రెడ్డి, కోచ్‌ సునంద కోరి, జిల్లా క్రీడల అధికారి ఎం.పరంధామరెడ్డి ఆమెను అభినందించారు.

హెచ్‌ఎం, ఉపాధ్యాయులపై డీఈఓ ఆగ్రహం

ఇల్లెందురూరల్‌: మండలంలోని సుభాష్‌నగర్‌ హైస్కూల్‌ను బుధవారం డీఈఓ వాసంతి సందర్శించారు. విద్యార్థుల నోట్‌బుక్స్‌ కరెక్షన్‌ చేయకపోవడం సరికాదని హెచ్చరించారు. బేస్‌లైన్‌ టెస్ట్‌ను కేవలం 39 శాతం విద్యార్థులకే నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ లాగిన్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించి ఉపాధ్యాయుడి లీవ్‌ను ఎందుకు అప్రూవ్‌ చేయలేదని, ఆగస్టులో టీచర్స్‌ మీటింగ్‌, పేరెంట్స్‌ మీటింగ్‌ ఎందు కు నిర్వహించలేదని హెచ్‌ఎం ఉమాశంకర్‌ను ప్రశ్నించారు. సైన్స్‌ల్యాబ్‌, లైబ్రరీలకు రిజిస్టర్‌ నిర్వహించకపోవడంపై సంతృప్తి వ్యక్తం చేశా రు. అనంతరం ఎంఈఓ కార్యాలయాన్ని సందర్శించి సీఆర్‌పీలకు విధినిర్వహణపై పలు సూ చనలు చేశారు. కార్యక్రమంలో ప్లానింగ్‌ కో ఆర్డినేటర్‌ సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

వ్యక్తిపై కేసు

పాల్వంచ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, బెదిరించిన వ్యక్తిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన 25 ఏళ్ల యువతి రుద్రంపూర్‌ ప్రభుత్వ ఐటీఐలో చదువుతున్న సమయంలో కుర్సం శ్రీరాములు(నాని) పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. అనంతరం తన స్వగ్రామమైన బొజ్జలగూడెం తీసుకెళ్లి సుమారు రెండేళ్ళపాటు కలిసి ఉన్నాడు. ఇటీవల సదరు యువతి పెళ్లి విషయం నిలదీయగా వివాహానికి నిరాకరించాడు. బాధితురాలి తో పాటు ఆమె తల్లిదండ్రులను అసభ్యకర పదజాలంతో దూషించి బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరిపై పోక్సో

కేసు నమోదు

బయ్యారం: మహబూబాబాద్‌ జిల్లా బయ్యా రం మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు బాలికలు గర్భం దాల్చగా.. ఇందుకు కారణమైన ఇద్దరిపై పోలీసులు బుధవారం పోక్సో కేసులు నమోదు చేశారు. ఎస్సై ప్రశాంత్‌బాబు కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన బాలికతో వివాహం జరిపించగా ఆమె గర్భం దాల్చింది. అదేవిధంగా మండలంలోని మరో గ్రామానికి చెందిన ఇరువురు మైనర్లు కొంతకాలంగా సహజీవనం చేస్తుండడంతో బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటనలపై ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఫిర్యాదు ఆధారంగా ఓ యువకుడు, బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement