వైరల్‌ ఫీవర్‌తో వణుకు | - | Sakshi
Sakshi News home page

వైరల్‌ ఫీవర్‌తో వణుకు

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

ఏజెన్సీ గ్రామాల్లో విస్తరిస్తున్న జ్వరాలు

బాధితులతో కిటకిటలాడుతున్న

ఆస్పత్రులు

భిన్న వాతావరణ పరిస్థితులే

కారణమంటున్న వైద్యులు

బూర్గంపాడు: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో వైరల్‌ ఫీవర్స్‌ ప్రజలను వణికిస్తున్నాయి. ఇంటికి ఒకరి ద్దరు చొప్పున జ్వరంతో బాధపడుతున్నారు. జలు బు, జ్వరం, ఒంటినొప్పులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. జ్వరపీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. భిన్న వాతావరణ పరిస్థితులే జ్వరాలకు కారణమని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీ లు, హెల్త్‌ సబ్‌సెంటర్‌లు, ప్రైవేటు ఆస్పత్రులకు జ్వరపీడితులు క్యూకడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు ఎక్కువగా వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు గురవుతున్నారు. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నా యి. రోజు 50 ఓపీ ఉండే ఆస్పత్రుల్లో ప్రస్తుతం 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇన్‌పేషెంట్లతో వార్డులు కూడా నిండిపోతున్నాయి. వైద్య పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ నెలకొంటోంది. బూర్గంపాడు సీహెచ్‌సీలో నిత్యం 150 ఓపీ కేసులు నమోదవుతున్నాయి.

అప్పుడే వర్షం.. ఆ తర్వాత ఎండ, ఉక్కపోత

ఒక్కరోజులోనే కొద్దిసేపు వర్షం, తర్వాత ఎండ తీవ్రత, ఉక్కపోత వంటి విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడి వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు గురవుతున్నారు. పొలం పనులకు వెళ్లిన రైతులు, కూలీలు, భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. వైద్యారోగ్య శాఖ స్పందించి గ్రామాల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించాలని, హెల్త్‌ క్యాంపులు పెట్టాలని పలువురు కోరుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, దోమల నివారణకు మందులు పిచికారీ, ఫాగింగ్‌ చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా వాతావరణ మార్పులతోనే జ్వరాలు పెరుగుతున్నాయని, సాధారణ రోజుల కంటే ఓపీ రెట్టింపైందని బూర్గంపాడు సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రసాద్‌ తెలిపారు. జ్వరం రాగానే వైద్య పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement