వన్యప్రాణుల వధ | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల వధ

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

● జిల్లా సరిహద్దుల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా ● తాజాగా చర్లలో చిరుత చర్మం, గోళ్లు స్వాధీనం ● అటవీశాఖ పర్యవేక్షణ లోపంపై విమర్శలు

మరింత నిఘా

● జిల్లా సరిహద్దుల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా ● తాజాగా చర్లలో చిరుత చర్మం, గోళ్లు స్వాధీనం ● అటవీశాఖ పర్యవేక్షణ లోపంపై విమర్శలు

భద్రాచలంటౌన్‌: వన్యప్రాణులను వేటగాళ్లు యథేచ్ఛగా వధిస్తున్నారు. చర్మం, గోళ్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా వన్యప్రాణుల వేట, అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు, అటవీశాఖ అధికారులు అరెస్ట్‌ చేశారు. చర్ల రేంజ్‌ పరిధిలోని కుర్నపల్లిలో నిర్వహించిన తనిఖీల్లో చిరుతపులి చర్మం, 9 గోళ్లు, 6 పళ్లు, పుర్రెను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కె.నారాయణ, పి.దేవేందర్‌, ఎ.సాయికిరణ్‌, జె.రాధాకృష్ణ, పి.సంతోష్‌, డి.బండిలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. గతేడాది అడవి వాలుగ(జాడు)ను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు సుమారు 16 మందిపై కేసులు నమోదు చేశారు. గత నెల 24న పులి చర్మం, గోళ్లను స్వాధీనం చేసుకుని, ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లాకు చెందిన నలుగురిని అరెస్ట్‌ చేశారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ అటవీ ప్రాంతాల నుంచి జిల్లాలోకి వస్తున్న వన్యప్రాణులను వేటగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉచ్చులు, విద్యుత్‌ తీగలతో హతమార్చుతున్నారు. వన్యప్రాణుల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ చెబుతున్నా.. వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు క్షేత్రస్థాయిలో నిఘాపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

వన్యప్రాణులను వధించవారిపై చర్యలు తీసుకుంటున్నాం. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో అటవీ సిబ్బందితో నిఘా మరింత తీవ్రం చేస్తాం. గ్రామాల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తాం.

–ఎన్‌ఎస్‌ నిషా, భద్రాచలం ఎఫ్‌డీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement