చండ్రుగొండ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం మృతి చెందాడు. చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ కథనం ప్రకారం... మండలంలోని మద్దుకూరు గ్రామానికి చెందిన తంబళ్ల రమేష్‌బాబు (39) ఈ నెల 8న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
జారిపడిన పెయింటింగ్ కార్మికుడు..
చుంచుపల్లి: రెండు అంతస్తుల భవనానికి పెయింటింగ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఓ కార్మికుడు మృతి చెందాడు. అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామానికి చెందిన పెరుమాళ్ల సతీష్ (28) రాంనగర్‌లోని ఓ భవనంలో మంగళవారం పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో భవనంపై నుంచి జారి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలుకాగా, భవనం యజమాని కొండబత్తిని మధు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. చుంచుపల్లి ఎస్సై రవి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాటుసారా స్వాధీనం
జూలూరుపాడు: మండలంలోని సురారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నాటుసారా తయారు చేసుకుని, బైక్‌పై తరలిస్తుండగా ఎకై ్సజ్‌శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. సంబంధిత వ్యక్తి పారిపోగా, సుమారు 10 లీటర్ల నాటుసారాతోపాటు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సిబ్బంది తెలిపారు.
రేషన్ బియ్యం సీజ్
టేకులపల్లి: మండలం తడికలపూడి పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో బుధవా రం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 350 కిలోల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఆటోను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ గుగులోత్ కుమార్‌ను విచా రించగా, తడికలపూడి పరిసర గ్రామాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి కారేపల్లికి చెందిన బానోత్ కోటేష్‌కు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. దీంతో కుమార్, కోటేష్‌లపై కేసు నమోదు చేశామని ఎస్సై తిరుపతి పేర్కొన్నారు.


