హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

టేకులపల్లి: హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం టేకులపల్లిలో ఇల్లెందు డీఎస్పీ వెంకన్న బాబు వెల్లడించిన వివరాల ప్రకారం..పూనెం నారా యణ అలియాస్‌ రామనారాయణ (59) అనే వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌ నుంచి నాలుగేళ్ల క్రితం ఆళ్లపల్లి మండలం సుద్దరేవు గ్రామానికి వలస వచ్చి కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొమరం రామనాథం కుటుంబంతో అతనికి పరిచయం ఏర్పడి, వ్యవసాయ పనుల్లో సహాయం చేసేవాడు. అయితే రామనాథం ఇంటికి నారాయణ తరచూ రావడం, మద్యానికి బానిసకావడం, క్షుద్రపూజలు చేస్తాడనే అనుమానంతో పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ నెల 11న రాత్రి కూడా నారాయణ మద్యం తాగి రామనాథం ఇంటికి వచ్చి గొడవపడ్డాడు. ఆ తర్వాత నారాయణను బెదిరించడానికి రామనాథం కత్తితో జల్లేరు వాగు వద్దకు వెళ్లాడు. అక్కడ నారా యణతో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగ్గా కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. మృతదేహాన్ని ముళ్లపొదల్లోకి నెట్టివేసి రామనాథం పారిపోయాడు. మర్కోడు పంచాయతీ సుద్దరేవు శివారులో జల్లేరు వాగు వద్ద మృతదేహం లభ్యంకాగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం సుద్దరేవు వద్ద నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ బత్తుల సత్యనారాయణ, ఆళ్లపల్లి ఎస్‌ఐ సోమేశ్వర్‌, టేకులపల్లి ఎస్‌ఐ తిరుపతి, సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement