టేకులపల్లి: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ చోరీ చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. టేకులపల్లి సర్కిల్ ఆఫీస్లో మంగళవారం డీఎస్పీ యూ.వెంకన్నబాబు వెల్లడించిన వివరాల ప్రకారం... సీఐ బి.సత్యనారాయణ, ఎస్సై కె.తిరుపతి సిబ్బందితో కలిసి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. పోలీసులను గమనించి ఆటోలో పారిపోతు న్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. విచారించగా నిందితులు పల్లపు వెంకటేష్, రౌతు రమేష్, వేముల సంతోష్‌గా తేలింది. వీరు ముత్యాలంపాడు, కోయగూడెం, శాంతి నగర్, సులానగర్, 9వ మైలు తండా, కొక్య తండా, బోడ్ ఏరియా పెట్రం చెలక తదితర ప్రాంతాల్లో 13 చోట్ల వరుస కాపర్ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రూ. 3.57లక్షల విలువైన 178.5 కేజీల కాపర్ వైరును పాల్వంచకు చెందిన స్క్రాప్ షాపు నిర్వాహకుడు సాయిరామ్, లోతువాగుకుక చెందిన తెలకలపల్లి బాబులకు విక్రయించినట్లు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న స్క్రాప్ వ్యాపారులు సాయిరామ్, తెలకలపల్లి బాబుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
13 చోట్ల రూ. 3.57 లక్షల విలువైన
తీగ అపహరణ


