జూలూరుపాడు(సుజాతనగర్): సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన భూక్యా ప్రకాష్ హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నాడు. ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ ఎం.వి.కృష్ణారావు పర్యవేక్షణలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ‘యాన్ ఎక్స్‌పరిమెంటల్ స్టడీ ఆన్ పెర్ఫార్మన్స్, స్ట్రెస్–స్ట్రైన్ బిహేవియర్ అండ్ మైక్రోస్ట్రక్చరల్ క్యారెక్టరిస్ట్టిక్స్ ఆఫ్ ఫైబర్ రైన్‌ఫోర్డ్స్ జియోపాలిమర్ కాంక్రీట్’అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. ఈ నెల 8న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో డాక్టరేట్ ప్రదానం చేశారు.


