కొత్తగూడెంఅర్బన్: నగరంలోని మధుర బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు సంధ్యాల కొమరయ్య కూతురు హైమావతి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. డాక్టర్ ఆలియా పర్యవేక్షణలో రసాయన శాస్త్ర విభాగంలో ‘డాకింగ్ స్టడీస్ అండ్ టెట్రాజోల్ డేరివేటివ్స్’అంశంపై చేసిన పరిశోధనా పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హైమావతిని కుటుంబీకులు, బంధువులు, మిత్రులు అభినందించారు.


