భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పారంపర్య వైద్య రాష్ట్ర మహాసభలు శుక్రవారంతో ముగిశాయి. శ్రీశైవక్షేత్ర వ్యవస్థాపక పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివస్వామి హాజరయ్యారు. ప్రకృతి పరిరక్షణ, ఔషధ మొక్కల పెంపకం, పచ్చదనం విస్తరణ కోసం సేవలందిస్తున్న మొక్కల వెంకటయ్య, మొక్కల రాజశేఖర్, నైనిక రజువా, ఎండి.ఆఫా జైదీ తదితరులను అభినందించారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ట్రెడిషనల్ డీలర్స్ ట్రైనింగ్ వర్క్‌షాప్, మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన సర్టిఫికెట్లను కూడా అందించారు. ఈ కార్యక్రమంలో మల్లిశాల స్వామీజీ, కృష్ణయ్య స్వామి, చంద్రశేఖర రాజు, సజ్జన రమేష్, దొంతు యాత్రి, బండి వెంకటేశ్వర్లు, ఎం.డి.జమాల్ ఖాన్, రామంచి శ్రీనివాస్, భాను ప్రసాద్, దుర్గారాణి, అరుణ, వీరభద్రాచారి పాల్గొన్నారు.
సుగుణారావుకు ఉత్తమ సేవా పురస్కారం
కొత్తగూడెంఅర్బన్: పారంపర్య వైద్య రంగంలో ప్రకృతి వైద్యం తోపాటు, ఆల్టర్నేటివ్ తెరపిస్ట్‌గా విశిష్ట సేవలు అందిస్తున్న వైద్య జి. సుగుణారావుకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. భద్రాచలంలో నిర్వహించిన పారంపర్య వైద్య మహాసంఘం సభల్లో ఈ వార్డును ప్రదానం చేశారు.


