రామాలయానికి రూ.5 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

రామాలయానికి రూ.5 లక్షల విరాళం

Sep 8 2026 12:35 AM | Updated on Sep 8 2026 12:35 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే పలు కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తురాలు సోమవారం విరాళం అందజేశారు. భీమవరంలోని ఏఎస్‌ఆర్‌ నగర్‌ కాలనీకి చెందిన చింతలపాటి సీతమ్మ గోశాల నిమిత్తం రూ.3 లక్షలు, శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.2లక్షలు ఇచ్చారు. ఈఓ దామోదర్‌రావుకు వారి తరఫున ఆలయ ఈఈ రవీందర్‌ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

కేఎల్‌ఆర్‌ యాజమాన్యానికి ‘శిక్షా రత్న’ పురస్కారాలు

పాల్వంచ: విద్యారంగంలో విశేష సేవలు అంది స్తున్న కేఎల్‌ఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ చైర్‌ పర్సన్‌ కె.నాగమణి, కేఎల్‌ఆర్‌ డిగ్రీ కళా శాల ప్రిన్సిపాల్‌ ఎ.నరసింహారావులకు శిక్షా రత్న–2026 పురస్కారాలు లభించాయి. ఆది వారం హైదరాబాద్‌లోని కన్హా శాంతివనంలో హరి విశ్వవిద్యాలయం, సూపర్‌ ఏఐ అకాడమీ, సాక్షి ఎడ్యుకేషన్‌, ఆదాబ్‌ హైదరాబాద్‌, స్టడీ9 మీడియా సంస్థలు సంయుక్తంగా పురస్కారాలను ప్రదానం చేశాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ డాక్టర్‌ వి.బాలకృష్టారెడ్డి, ఐసీఏఆర్‌–ఏఐసీఆర్‌పీ డైరెక్టర్‌ డాక్టర్‌ తారా సత్యవతి అవార్డులను అందజేశారు.

ప్రజావాణి వద్దే పశువైద్యం

వెటర్నరీ డాక్టర్‌కు పలువురి అభినందన

ములకలపల్లి: మండలకేంద్రంలోని రైతువేదిక వద్ద సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఎంపీడీఓ సత్యనారాయణ, డీటీ భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు హాజరై దరఖాస్తులను స్వీకరించారు. అదే సమయంలో ములకలపల్లి, సమీప గ్రామానికి చెందిన అన్నె శ్రీనివాసరావు, గుమ్మడి వెంకటేశ్వర్లు తమ పశువులను స్థానిక పశువైద్యశాలకు తీసువచ్చారు. వెటర్నరీ ఆస్పత్రిలో నాలుగు పోస్టులు ఉండగా, ప్రస్తుతం డాక్టర్‌ రామకృష్ణ ఒక్కరే విధులు నిర్వరిస్తున్నారు. ఆయన కూడా ప్రజా వాణికి హాజ రయ్యారు. పశువైద్యం కోసం సంప్రదించగా రైతు వేదిక వద్దకే రప్పించి పశువులకు చికిత్స అందించారు. ఈ సందర్భంగా రామకృష్ణను పలువురు అభినందించారు.

పెద్దమ్మతల్లి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభం

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి ఆలయంలో నిత్యాన్నదానం కార్యక్రమాన్ని సోమవారం ఈఓ రజనీకుమారి ప్రారంభించారు. మండల పరిధి లోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయం ప్రాంగంలోని అన్నదాన సత్రంలో అమ్మవారి భక్తురాలైన జ్యోతి జన్మదినం సందర్భంగా రూ.5,116 విరాళం అందించగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మరో భక్తుడు కొండం పుల్ల య్య కూడా మంగళవారం అన్నదానం కోసం రూ.5,116 విరాళం అందించారు.

సమతుల ఆహారంపై అవగాహన

చుంచుపల్లి: పోషకాహార వారోత్సవాల సందర్భంగా ప్రజలకు సమతుల ఆహారం, పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల పై అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారామ్‌ రాథోడ్‌ వైద్య సిబ్బందికి సూచించారు. సోమవారం రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తని ఖీ చేశారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు తగిన మోతాదులో తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement