అర్జీలకు పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలకు పరిష్కారం చూపాలి

Sep 8 2026 12:35 AM | Updated on Sep 8 2026 12:35 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజల నుంచి స్వీకరించే ప్రతీ వినతిని నిశితంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్‌, విద్యాచందనతో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. అర్జీలను పరిశీలించి పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించారు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటి వివరాలు

● గ్రామంలో డ్రెయినేజీ సమస్యను పరిష్కరించా లని కోరుతూ జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామ ప్రజలు అందజేసిన దరఖాస్తును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జూలూరుపాడు ఎంపీడీఓకు ఎండార్స్‌ చేశారు.

● 35 ఏళ్లుగా నివసిస్తున్నా తమ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల లేదని బూ ర్గంపాడు మండలం సారపాక గ్రామపంచా య తీ పరిధిలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి చెందిన 65 గిరిజన కుటుంబాలవారు విన్నవించారు. దీంతో తగిన చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓకు ఎండార్స్‌ చేశారు.

● తనకు సర్వేనంబర్‌ 617లో ఐదెకరాల పట్టా భూమి ఉండగా, రెండెకరాలను సింగరేణి ఓపెన్‌ కాస్టు కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఇల్లెందు మండలం సుదిమల్ల గ్రామానికి చెందిన ధనసరి పగిడిద్దరాజు తెలిపారు. మిగిలిన మూడు ఎకరాల భూమికి సంబంధించిన పాత రికార్డులను సవరించి, తన పేరుపై నూతన పట్టాదారు పాస్‌బుక్‌ జారీ చేయాలని కోరారు.

ఈవీఎం గోదాం తనిఖీ

త్రైమాసిక తనిఖీ ల్లో భాగంగా సోమవారం కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్‌ అంకిత్‌ తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత ఎన్నికల అధి కారుల సమక్షంలో ఈవీ ఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన గదులను పరిశీలించారు. అనంత రం తిరిగి సీల్‌ చేయించారు. కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఎన్నికల సూపరింటెండెంట్‌ రంగ ప్రసాద్‌, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ, బీఆర్‌ఎస్‌, సీపీఎం నాయకులు లక్ష్మణ్‌ అగర్వాల్‌, రాంబాబు, అనుదీప్‌, సలీం, సిబ్బంది పాల్గొన్నారు.

నోటీసుల జారీ వేగవంతం చేయాలి

ఎస్‌ఐఆర్‌ నోటీసుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి హాజరైన కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడు తూ దాదాపు 60శాతం నోటీసుల జారీ ప్రక్రి య పూర్తయిందని తెలిపారు. హియరింగ్‌ నిర్దేశిత కార్యాచరణ ప్రకారం నిర్వహిస్తున్నామని తెలిపారు. నోమ్యాపింగ్‌, అనామలీస్‌కు సంబంధించిన ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని వివరించారు.

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement