భద్రాచలం: గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అధికారులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, ఖమ్మం రీజియన్ పరిధిలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతుల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్‌రాజ్, ఆనందకుమార్, అరుణకుమారి, మధుకర్, సైదులు, ఉదయ్ కుమార్, వేణు, రాంబాబు, గన్యా, మణిధర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ విద్యారులకు అండగా..
ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన పేద గిరిజన విద్యార్థులకు పీఓ ఐటీడీఏ తరఫున ఆర్థికసాయం చేశారు. ములకలపల్లి మండలం సీతాయిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ విద్యార్థి నక్క సంతోష్‌కు రూ.60 వేలు, కోదాడ మండలం కొత్తగూడెం తండాకు చెందిన భూక్య వాసికి రూ.50వేల ఆర్థికసాయాన్ని అందించారు. భద్రాచలం కోయ కుల సంఘం పటేల్ తెల్లం రమణయ్య, ఆదివాసీ నాయకులు కుంజాధర్మా, కుంజా సంతోష్, పూనెం వీరభద్రం, గుండు శరత్, పాయం రవివర్మ, ముర్ల రమేష్, పూనెం నాగేశ్వరరావు, కొండ్రు వీరస్వామి, కొండ్రు సుధారాణి, కణితి రాధ, ఎం.నాగమణి పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


