సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమానికి అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక దరఖాస్తులను అందజేయాలని సూచించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం, అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో కూడా ప్రజా వాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్నిశాఖల అధికారులు హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సబ్ కలెక్టర్ కార్యాలయంలో...
సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని భద్రాచలం డివిజన్ ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఒక ప్రకటనలో కోరారు.
నేడు రౌండ్ టేబుల్ సమావేశం
సూపర్‌బజార్(కొత్తగూడెం): ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన గిరి జన నర్సు హత్య, అత్యాచారం ఘటనపై సోమవారం సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ, ప్రజా, సామాజిక సంఘాల నాయకులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు.
మహిళలకు
రక్షణ కరువైంది
టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ములకలపల్లి: కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురైన నర్సు కుటుంబాన్ని ఆదివారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలకపక్షం కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఘటనపై సీబీఐ విచారణ జరపాలని, ఘటన చోటు చేసుకున్న ఆస్పత్రి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి రూ. 50 వేలు ఆర్థికసాయం అందించారు. పార్టీ రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు మనోజ, రాష్ట్ర కార్యదర్శి కనగాల చైత న్య, జిల్లా ఇన్‌చార్జ్ వీరన్న, వాసం రామకృష్ణ, కోరం వెంకటేశ్వర్లు, లకావత్ సురేష్, వాకుడోతు రవి పాల్గొన్నారు.
న్యాయం జరిగే వరకు పోరాటం
ఆదిలాబాద్ ఎంపీ నగేష్
ములకలపల్లి: దారుణ హత్యకు గురైన నర్సు కు టుంబానికి న్యాయం జరిగే వరకూ బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ అన్నారు. బాధిత కుటుంబా న్ని ఆదివా రం పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిందితులు, ఆస్పత్రి బాధ్యులపై కఠి న చర్యలు తీసుకోవాలని కోరారు. మృతురాలి కు టుంబానికి రూ.కోటి పరిహారంతోపాటు, పది ఎకరాలవ్యవసాయ భూమి, ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో రూ. లక్ష ఆర్థికసాయం చేశారు. మాజీ ఎంపీ సీతారాం నాయ క్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు విజయచంద్రారెడ్డి, బాలరాజు, కుంజా ధర్మ, పుణ్యం భిక్షపతి, వెంకన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కిన్నెరసానిలో
పర్యాటక సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతా ల నుంచి సందర్శకులు తరలివచ్చారు. డీర్ పార్కులోని దుప్పులను, జలాశయాన్ని వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 427 మంది పర్యాటకులు కిన్నెరసానిని సందర్శించారు. 230 మంది బో టింగ్ చేశారు. పలువురు సఫారీలో విహరించారు. దీంతో రూ.40,595 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.


