పాల్వంచరూరల్: శ్రావణమాసం చివరి రోజు, ఆది వారం కావడంతో పెద్దమ్మతల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. వివిధప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆల య ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూ లైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించారు. పూజా కార్యక్రమాల్లో ఈఓ రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
భక్తులపాట్లు
శ్రావణమాసం చివరి రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట చెట్ల కింద నైవేద్యం వండుకుని అమ్మవారికి సమర్పించారు. చెట్ల కింద వంట చేసుకునే ప్రదేశంలో పైపులైన్ నిర్మా ణం కోసం తీసిన కాలువను పూడ్చకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ప్రమాదకరంగా ఉన్న పైపులైన్ కాలువను పూడ్చివేయాలని ఈఓను కోరారు.
ఆలయంలో నేడు అన్నదానం
పెద్దమ్మతల్లి ఆలయంలో నిత్యాన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్నదాన సత్రంలో సోమవారం భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అమ్మవారికి విశేష పూజలు


