పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు స్క్రీనింగ్‌ టెస్ట్‌

Sep 7 2026 12:15 AM | Updated on Sep 7 2026 12:15 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): తెలంగాణ పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు ఆదివారం జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించారు. శిక్షణ కోసం 1,216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,030 మంది స్క్రీనింగ్‌ టెస్ట్‌కు హాజరయ్యారు. జిల్లాలోని ఐదు సబ్‌ డివిజన్లపరిధిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ రోహిత్‌రాజు కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపికై న అభ్యర్థులకు రాత, శారీరక దారుఢ్య పరీక్షల్లో ప్రతిభ చూపాలని శిక్షణ ఇస్తామని తెలిపారు. సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొని పరీక్ష ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.

1,216 దరఖాస్తులు.. 1,030 మంది అభ్యర్థులు హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement