● సుష్మిత, ప్రకాష్‌రాజ్, అక్షయ్
ప్రకాష్‌రాజ్, మేక శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుష్మిత శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుష్మిత కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన ఈ సిరీస్ సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఇదే మన వైకుంఠపురం... ముప్పై ఏళ్ల తర్వాత సంగీత భారతిని నిర్ణయించే సమయం వచ్చింది’ అంటూ తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ‘స్వచ్ఛమైన సంగీతమే నా ఉచ్ఛ్వాసం... నిశ్వాసం. ఎన్ని పాశ్చాత్య సంగీత పిల్ల కాలువలు పుట్టినా.. అన్నింటికీ అమ్మ శాసీ్త్రయ సంగీతమే’.. అంటూ ప్రకాష్‌రాజ్ చెప్పిన పలు డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి. ‘‘హిందీ సిరీస్ ‘బందిష్ బాండిట్స్’ స్ఫూర్తితో ‘జగమే సంగీతం’ని రూపొందించారు. ‘‘కుటుంబం, సంప్రదాయం, ఆత్మశోధనకు సంబంధించిన ఒక హృద్యమైన కథను ఈ సిరీస్ ఆవిష్కరిస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు.


