విద్యా ప్రమాణాలు పెంచేలా.. | - | Sakshi
Sakshi News home page

విద్యా ప్రమాణాలు పెంచేలా..

Aug 27 2026 12:24 AM | Updated on Aug 27 2026 12:24 AM

● ఇంటర్మీడియట్‌ సిలబస్‌లో మార్పులు ● ఇక నుంచి ఫస్టియర్‌ విద్యార్థులకూ ప్రాక్టికల్‌ విద్య ● మాధ్యమిక విద్య స్థాయిలోనే ఏఐ పాఠాలు ఫ్యాకల్టీకి శిక్షణ కూడా ఇచ్చాం ● పరీక్షలకు సులభంగా.. ఆసక్తి పెరుగుతోంది

● ఇంటర్మీడియట్‌ సిలబస్‌లో మార్పులు ● ఇక నుంచి ఫస్టియర్‌ విద్యార్థులకూ ప్రాక్టికల్‌ విద్య ● మాధ్యమిక విద్య స్థాయిలోనే ఏఐ పాఠాలు

పాల్వంచరూరల్‌: ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ ప్రథ మ సంవత్సరం సిలబస్‌లో మార్పులు చేపట్టింది. ప్రాక్టికల్స్‌ విధానంలో కూడా మార్పులు చేసింది. విద్యా ప్రమాణాల పెంచడమే లక్ష్యంగా ఇంటర్మీడియట్‌ బోర్డు ఈ నిర్ణయాలు తీసుకుందని అధికారులు చెబుతున్నారు. 2026–27 విద్యాసంవత్సరం నుంచి సవరించిన పాఠ్యపుస్తకాలు, డిజిటల్‌ బోధనా పద్ధతులను అమలు చేస్తున్నారు. ఇంటర్‌ స్థాయిలోనే ఏఐ బోధన ప్రవేశపెట్టడం ద్వారా భవిష్యత్‌లో ఇంజనీరింగ్‌ చేసే విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొంద డం కూడా సులువుగా మారుతుంది.

ఇవి మార్చారు..

ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో తెలుగు సబ్జెక్ట్‌ను పూర్తిగా మార్చారు. సబ్జెక్టుల వారీగా కూడా కుదింపు చేశారు. జంతుశాస్త్రంలో 13 చాప్టర్లు ఉంటే పదికి కుదించారు. గత విద్యాసంవత్సరం వరకూ ద్వితీ య సంవత్సరం పిల్లలకే ప్రాక్టికల్‌ పరీక్షలు ఉండేవి. ఈసారి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్‌ ప్రవేశపెట్టారు. సైన్స్‌ గ్రూప్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ మార్కులు 30 ఉండగా, ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కులు ఉంటాయి. ఇక భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్‌ ఆఫ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలాజీస్‌ చేర్చారు. గణితశాస్త్రంలో అనుక్రమాలు, శ్రేణులు, సమితుల సిద్ధాంతం అధ్యాయనాలు చేర్చారు. రసాయన శాస్త్రంలో కూడా కొన్ని పాఠాలు తొలగించారు. ఎకానమిక్స్‌లో పాజిటివ్‌ ఎకామిక్స్‌, నార్మేటివ్‌ ఎకానామిక్స్‌ పాఠాలను చేర్చారు. స్టాటిస్టిక్స్‌ సూచీ సంఖ్యలనూ కొత్తగా చేర్చారు. చరిత్రలో దక్షిణ భారతదేశం, దక్కన్‌ రాజ్యాలు, ప్రాంతీయ రాజ్యాలను నూతనంగా చేర్చారు. మారాఠాలు, ప్రాంతీయ శక్తుల ఎదుగుద ల తదితర పాఠ్యాంశాలను తొలగించారు. మరి కొన్ని పాఠ్యాంశాలను విలీనం చేశారు.

బోధకులకు శిక్షణ

మార్పు చేసిన తెలుగు, చరిత్ర, రసాయన, ఆర్థికశాస్త్ర పాఠ్యాంశాల బోధనపై అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. అందరికీ కొత్తగూడెం జూనియర్‌ కళాశాలలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డిజిటల్‌ సాధనాల బోధనపై శిక్షణ ఇచ్చారు. 6,7 తేదీల్లో, 11, 12 తేదీల్లో, 18, 19 తేదీ ల్లో మూడు విడతలుగా శిక్షణ ఇచ్చారు.

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సైన్స్‌, ఆర్ట్స్‌ గ్రూపుల విద్యార్థుల సబ్జెక్టుల్లో మార్పులు, చేర్పులు జరిగా యి. బోధనా పద్ధతులపై అనుభవం కలిగిన నిపుణల ద్వారా లెక్చరర్లకు శిక్షణ ఇచ్చాం. గతంలో ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్‌ విద్య ఉండేది. ఈసారి నుంచి ఫస్టియర్‌ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్‌ ఉంటాయి.

–వెంకటేశ్వరరావు, డీఐఈఓ

సిలబస్‌ కుదించడం వల్ల పరీక్షలకు సులభంగా సిద్ధం కావొచ్చు. ఇంటర్నల్‌ మార్కులు ఉండటం సోర్కింగ్‌ పెరిగే అవకాశం ఉంది. థియరీ పరీక్షలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.

–యోషిత, ఫస్టియర్‌ ఎంపీసీ

అధునిక పద్ధతుల ద్వారా బోధించడం వల్ల చదువుపై ఆసక్తి పెరుగుతోంది. ప్రభుత్వం ఆన్‌లైన్‌ బోధనలు పద్ధతులు అమలు చేస్తుండటంతో విషయ పరిజ్ఞానం కూడా ఎక్కువగా తెలుస్తోంది.

–యేసుమణి, ఫస్టియర్‌ బైపీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement