దుమ్ముగూడెం: మండల పరిధి లక్ష్మీనగరం గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్‌లో వినియోగదారుడికి, బంక్ సిబ్బందికి బుధవారం వాగ్వాదం జరిగింది. నర్సాపురం గ్రామానికి చెందిన వీరమాచినేని వినీల్ తన కారులో డీజిల్ కొట్టించాడు. బంక్ సిబ్బంది 46.750 లీటర్ల డిజీల్ కొట్టగా, ఇంకా ఖాళీగా ఉండటంతో మరో అర లీటర్ కొట్టడంతో ఫుల్ ట్యాంకు అయినట్లు రీడింగ్ చూపించింది. దీంతో హడలిపోయిన వినీల్ 42 లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంకులో 47.250లీటర్లు ఎలా పట్టిందని ప్రశ్నించారు. దీంతో వాగ్వాదం నెలకొంది. ఫిర్యాదు చేసుకోవాలని సిబ్బంది పేర్కొనడం గమనార్హం. బుధవారం సెలవు దినం కావడంతో గురువారం అధికారులకు ఫిర్యాదు చేస్తానని వినీల్ తెలిపారు. గతంలో కూడా ఈ బంక్‌లో పలు ఆరోపణలు వచ్చాయి.
42 లీటర్ల కెపాసిటీ ట్యాంక్‌లో
47.250 లీటర్లు కొట్టినట్లు రీడింగ్


