కేసుల ఛేదనలో పోలీసుల సత్తా | - | Sakshi
Sakshi News home page

కేసుల ఛేదనలో పోలీసుల సత్తా

Aug 15 2026 12:10 AM | Updated on Aug 15 2026 12:10 AM

అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నేరాల

వెరిఫికేషన్‌ 100 శాతం పూర్తి

భద్రాచలంఅర్బన్‌ : కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమన్వయ పోర్టల్‌లో జిల్లా పోలీసులు ఉత్తమ ప్రతిభ కనబరిచి టాప్‌ స్థానాన్ని సాధించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి నేరాలకు సంబంధించిన వ్యక్తులు, చిరునామాలు, వివరాలపై వచ్చే అభ్యర్థనలను సమన్వయ పోర్టల్‌ ద్వారా జిల్లా పోలీసులకు పంపిస్తుంటారు. ఆయా వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉన్నారా? ఇచ్చిన చిరునామా, వివరాలు సరైనవేనా? అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నివేదికలను తిరిగి పోర్టల్‌ ద్వారా సంబంధిత అధికారులకు పంపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జిల్లాకు ఏడా ది కాలంలో 106 కేసుల వెరిఫికేషన్‌ అభ్యర్థనలు అందగా, 100 శాతం నివేదికలు సమర్పించారు. ఎస్పీ రోహిత్‌రాజు, సైబర్‌ క్రైమ్‌ సీఐ జితేందర్‌ విచారణ చేపట్టారు. దీంతో పోలీసు శాఖకు ప్రత్యేక గౌరవం, బహుమతి లభించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ సీ.వీ.ఆనంద్‌, టాలీవుడ్‌ సీనిమా హీరో అక్కినేని నాగా ర్జున చేతుల మీదగా ప్రశంసా పత్రాన్ని సైబర్‌ క్రైమ్‌ సీఐ జితేందర్‌ అందుకున్నారు.

నేటి నుంచి గిరిజన రైతుల ఆందోళన

అశ్వారావుపేటరూరల్‌: మండలంలోని వేదాంతపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరులో భూములు ఉన్న గిరిజన రైతులు శనివారం నుంచి ఆందోళన చేపట్టనున్నారు. వీరికి ఐదారు దశాబ్దాల క్రితం రెవెన్యూ శాఖ పట్టా లు ఇచ్చినా, పూర్తిస్థాయి భూమి యాజమాన్య హక్కులు దక్కలేదు. అప్పటి నుంచి పంటలు సాగు చేసుకుంటున్నా అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు చెబుతున్నారు. ఆయా శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో గిరిజన రైతులు బాధితులుగా మారారు. స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు గడిచినా తమకు హక్కులు దక్క డం లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం స్వాతంత్ర దినోత్సవం రోజున నిరసన దీక్ష చేపట్టనున్నారు. మూడు రోజులపాటు దీక్ష చేసి, ఆ తర్వాత రెవెన్యూ, అటవీ శాఖ(డీఎఫ్‌ఓ) కార్యాలయాల వరకు పాదయాత్ర, కార్యాలయాల ముట్టడి చేపడతామని బాధితులు తెలిపారు.

అటవీ ఉద్యోగుల

కొవ్వొత్తుల ర్యాలీ

అశ్వారావుపేటరూరల్‌: బూర్గంపాడులో వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలకు తగిలి, విధి నిర్వహణలో మృతి చెందిన ఎఫ్‌బీఓ నవీన్‌ ఆత్మకు శాంతి చేకురాలని శుక్రవారం రాత్రి అశ్వారావుపేటలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక రింగ్‌రోడ్‌ సెంటర్‌ నుంచి బస్టాండ్‌ వరకు ప్రదర్శన నిర్వహించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేంజర్లు మురళి, శ్రీనివాసరావు ఎఫ్‌బీఓ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌వోలు, ఎఫ్‌బీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.

గంజాయి స్వాధీనం

సత్తుపల్లి టౌన్‌: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కారులో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని ఈగల్‌ టీమ్‌, సత్తుపల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.12 లక్షల విలువైన 6.360కేజీల గంజాయితో పాటు కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement