●రూ.26 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో మూడున్నర నెలలుగా చోటుచేసుకుంటున్న చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. శుక్రవారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రోహిత్‌రాజు వెల్లడించిన వివరాల ప్రకారం... అశ్వారావుపేట, దమ్మపేట, బూర్గంపాడు, పాల్వంచ రూరల్, టేకులపల్లి, కొమరారం, జూలూరుపాడు, చంద్రుగొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన వరుస చోరీ కేసులపై పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేయగా, మరో అంతర్రాష్ట్ర నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి సుమారు 150 గ్రాముల 6 బంగారు గొలుసులను, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీ నం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ సుమారు రూ.26లక్షలు ఉంటుందని తెలిపారు.
ఇళ్ల బయట నిద్రిస్తున్న మహిళలే టార్గెట్
ప్రధాన నిందితుడు సున్నం నాగేంద్రబాబు తన సహచరులతో కలిసి రాత్రివేళల్లో ఇళ్ల బయట నిద్రి స్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డాడు. కొన్ని సందర్భాల్లో ముందుగానే ద్వి చక్ర వాహనాలను చోరీ చేసి, వాటిని తదుపరి నేరా లకు ఉపయోగించారు. చోరీచేసిన బంగారు ఆభరణాలను ముఠాకు సహకరిస్తున్న మహిళల వద్ద దాచిపెట్టారు. దర్యాప్తులో వివిధఠాణాల పరిధిలో 10 కేసులకు సంబంధించి కీలక ఆధారాలు లభించాయి. ఈ ముఠాలో అశ్వారావుపేట మండలం ఉసిర్లగూడెం గ్రామానికి చెందిన సున్నం నాగేంద్రబాబు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 83 చోరీ కేసులు నమోదయ్యాయి. మిగి తా నిందితులు వల్లూరి శాంతరాజు, ఉకే భద్రం, బెత్తి కార్తీక్, ఊర లింగయ్య, బెత్తి ఆదిలక్ష్మి, కల్లూరి లావణ్య, అల్లం సారమ్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు, ఆంధ్రప్రదేశ్‌లోని చెందిన ముప్పాళ్ల మండలం, మాధాల గ్రామానికి చెందని తమ్మిశెట్టి బాలవీరస్వామి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు ఛేదించిన పోలీసులను ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు. ఈ కేసుల ఛేదనలో పాల్వంచ డీఎస్పీ సతీష్‌కుమార్, అశ్వారావుపేట సీఐ నాగరాజు, ఎస్‌ఐలు రాజేశ్‌కుమార్, యయాతి రాజు, బాలస్వామినాధం, దేవ్‌సింగ్, హెచ్‌సీ ప్రసాద్, పీసీలు వెంకట్, ధర్మారావు, లక్ష్మయ్య, రామకృష్ణారెడ్డి, బాలకృష్ణ, నరసింహారావు, డబ్ల్యూపీసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.


