ఫోర్జరీ సంతకాలు.. నకిలీ పత్రాలు? | - | Sakshi
Sakshi News home page

ఫోర్జరీ సంతకాలు.. నకిలీ పత్రాలు?

Aug 15 2026 12:10 AM | Updated on Aug 15 2026 12:10 AM

● ఇల్లు, ఐటీసీ కాంట్రాక్టుల పేరుతో వసూళ్లు ● విచారణలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ‘భరత్‌’ వ్యవహారాలు

పాల్వంచ రూరల్‌

పోలీసుల కస్టడీలో భరత్‌

● ఇల్లు, ఐటీసీ కాంట్రాక్టుల పేరుతో వసూళ్లు ● విచారణలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ‘భరత్‌’ వ్యవహారాలు

భద్రాచలంఅర్బన్‌: రూ.52కోట్ల మోసం కేసులో నిందితుడు భరత్‌ వ్యవహారాలు తవ్వినకొద్దీ వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీసీలో సబ్‌ కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ కాంట్రాక్టర్లను నమ్మించి డబ్బులు వసూలు చేశారనే ఆరో పణలు కూడా వచ్చాయి. తాజాగా ఓ రాజకీయ నాయకు డు పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు సంతకాలు ఫోర్జరీ చేసి, వారి ఇల్లు, ఆస్తిని లేదా కాంట్రాక్టు హక్కులను ఇతరులకు అప్పగిస్తున్నట్లు చూపించేలా డాక్యుమెంట్లు, వీలు నామా పత్రాలు నకిలీవి సృష్టించినట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా ఇతరుల నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరో పణలు వస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ పత్రంలో రూ.90లక్షల లావాదేవీకి సంబంధించిన ప్రస్తావన ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అయి తే విచారణలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇలా ఎన్ని పత్రాలు సృష్టించారు? ఎంత మంది నుంచి ఏ మేర కు వసూళ్లు చేశారనే వివరాలు తేలాల్సి ఉంది. బాధితులు ముందుకు వస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. భరత్‌ కుటుంబ సభ్యులను పోలీసులు విచారించినట్లు, సీజ్‌చేసిన ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు, మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సమాచారం ఉన్నా.. అధికారికంగా ధ్రువీకరించలేదు. మరోవైపు భరత్‌ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు కూడా తమకు తెలిసిన విషయాలపై పొంతనలేని సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంటిని విక్రయించినట్లు సృష్టించిన నకిలీ పత్రాలు

పాల్వంచరూరల్‌: రూ.52 కోట్ల మోసం కేసులో అరైస్టె, జైలుకు వెళ్లిన భరత్‌ను పాల్వంచ రూర ల్‌ పోలీసులు మూడురోజులపాటు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. అధిక వడ్డీ ఇస్తానని పాల్వంచ మండలం యానంబైల్‌ గ్రామానికి చెందిన కంటెం సతీష్‌, శ్రావణి దంపతుల నుంచి రూ.1.48కోట్లు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వకపోవడం, అతను కనిపించకపోవడంతో బాధితురాలు గత నెల 18న పాల్వంచ రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేయగా ఎస్‌ఐ సురేశ్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవా రం భరత్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నా రు. అతని కుటుంబ సభ్యులనూ విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement