కొత్తగూడెంఅర్బన్: గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. గ్రంథాలయ రంగంలో విశిష్ట సేవలందించిన ఎస్‌ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని బుధవారం జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం గ్రంథాలయంలో రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీరబాబు మాట్లాడుతూ గ్రంథాలయాలు సమాజంలో చైతన్యాన్ని పెంచుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కరుణకుమారి, ఎస్.లలితకుమారి, మణిమృదుల, నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్‌లో ప్రజావాణి
కొత్తగూడెం కార్పొరేషన్‌లో బుధవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల ద్వారా 34 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ రోడ్లు, డ్రెయినేజీలు, వీధిలైట్లు, పైపులైన్, తాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్యలపై ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని, వాటిని సకాలంలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుజాత, సహాయక మిషనర్ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు


