భద్రాచలం: గిరిజన విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు రూపొందించిన ఉద్దీపకం లక్ష్యం నెరవేరేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. బుధవారం భద్రాచలం గిరిజన విద్యా కళాశాలలో ఉద్దీపకం–3పై ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గణితాన్ని సులభంగా బోధించేలా వస్తువులు, చిత్రాలు, బోధనాభ్యసన సామగ్రిను వినియోగించాలన్నారు. స్లో లెర్నర్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి మానసిక స్థాయికి తగినట్లుగా బోధన ఉండాలని చెప్పారు. ఐటిడీఏ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.చందన, భద్రాచలం, ఖమ్మం ఎసీఎంవోలు, బి. రమేష్, రాములు, బి.ఎడ్. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ భవాని, ఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


