జిల్లా న్యాయసేవా అధికార సంస్థ
కార్యదర్శి రాజేందర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ సూచించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రుద్రంపూర్ ప్రభుత్వ ఐటీఐలో నాల్సా జాగృతి పథకం, సైబర్ నేరాలపై న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన, తమ హక్కులు, బాధ్యతలను వివరించారు. సైబర్ క్రైమ్ సీఐ జితేందర్ సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు, ఫేక్ లింకులు, ఫిషింగ్, యుపీఐ బ్యాంకింగ్ మోసాల నుంచి అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కల్పించారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జి.మహేశ్వరరావు, న్యాయవాదులు కున్సోత్ నవీన్, లావుడ్యా రమేష్, ఐటీఐ ప్రిన్సిపాల్ గోనెల రమేష్, సిబ్బంది కిషోర్, సోడే ఆనంద్ పాల్గొన్నారు.


