విద్యావ్యవస్థ బలోపేతమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విద్యావ్యవస్థ బలోపేతమే లక్ష్యం

Aug 12 2026 12:34 AM | Updated on Aug 12 2026 12:34 AM

దమ్మపేట: అశ్వారావుపేట నియోజకవర్గంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘ఎమ్మెల్యే విద్యా యాత్ర’చేపడుతున్నామని ఎమ్మె ల్యే జారె ఆదినారాయణ తెలిపారు. ‘ఎమ్మెల్యే విద్యాయాత్ర’కార్యక్రమాన్ని మండలంలోని గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో ఆయన మంగళవారం ప్రారంభించారు. పాఠశాలలో తరగతి, వసతి గదులను తనిఖీ చేయడమేకాక సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆతర్వాత విద్యార్థులతో కలసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే, మెనూ బోధనపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. అంతేకాక పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సులో మాట్లాడారు. ఎంపీడీఓ రవీంద్రారెడ్డి, తహసీల్దార్‌ మురళి, సీఐ నాగరాజురెడ్డి, ఎస్‌ఐ రాజేష్‌కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

‘ఎమ్మెల్యే విద్యాయాత్ర’లో ఆదినారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement