డీపీఆర్‌ టెండర్‌ను రద్దు చేయాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

డీపీఆర్‌ టెండర్‌ను రద్దు చేయాల్సిందే..

Aug 12 2026 12:34 AM | Updated on Aug 12 2026 12:34 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కొత్తగూడెం ము న్సిపల్‌ కార్పొరేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా, పారదర్శకత లేకుండా నిర్వహించిన రూ. 9.60 కోట్ల డీపీఆర్‌ టెండర్‌ను తక్షణమే రద్దు చేసి ఎమ్మె ల్యే సాంబశివరావు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జైభీమ్‌రావు భారత్‌పార్టీ (జేబీపీ) స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఝెర్రా కామేష్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.కార్పొరేషన్‌లో అభివృద్ధి పనుల కోసం డీపీఆర్‌ రూపొందించేలా రూ 9.60 కోట్లతో టెండర్‌ పిలిచి, మూడు రోజులే గడువు ఇవ్వ డం సరికాదన్నారు. కేవలం రెండు దరఖాస్తులే వచ్చినందున రద్దు చేయాల్సిందేనన్నారు. టెండర్‌ ప్రక్రియలోనే జరిగిన అక్రమాలకు ఎవరు బాధ్యులో తేల్చడమే కాక టెండర్‌ రద్దు చేసే వరకూ పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు, నాయకులు నాగుల రవికుమార్‌, గజ్జల శంకర్‌, వినయ్‌, సోను, మున్నా పాల్గొన్నారు.

విస్తా కాంప్లెక్స్‌లో

స్క్రాప్‌ అమ్మకం

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలంలో ఐటీడీఏ ఆధీనంలోని విస్తా కాంప్లెక్స్‌లో పాడైన మిషనరీ, ఇతరత్రా నాలుగు టన్నుల స్క్రాప్‌ అమ్మనున్నట్లు ప్రాజెక్టు అధికారి బి.రాహుల్‌ తెలిపా రు. షాపు నంబర్లు 9, 30లో రంగురాళ్లకు సంబంధించిన పాడైన మిషనరీ, ఇతర స్క్రాప్‌, షాపు నంబర్‌ 9లో 2.50 టన్నులు, షాపు నంబర్‌ 30లో సుమారు 1.50 టన్నుల స్క్రాప్‌ ఉందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 14న సాయంత్రం 4 గంటలకు విస్తా కాంప్లెక్స్‌ కు హాజరై కొనుగోలు చేయొచ్చని, వివరాలకు 94415 07135 నంబర్‌లో సంప్రదించాలని పీఓ సూచించారు.

దాడి ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు

ఇల్లెందురూరల్‌: పట్టణంలోని 24ఏరియాలో గత నెల 24వ తేదీన జరిగిన దాడి ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సురేష్‌ మంగళవారం తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. 24 ఏరియాకు చెందిన క్రాంతికుమార్‌పై అతని ఇంటి వద్దే గుళ్లగట్టు ప్రకాష్‌, సుధారాణి, వెంకటేశ్వర్లు, వంవీకుమార, జరీనా, జానీ దాడి చేస్తున్న విషయం తెలుసుకొని 21ఏరియాకు చెందిన మెరుగు కృష్ణవేణి అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆమైపె కూడా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో తనకు న్యాయం చేయాలని కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేయగా దాడి చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

విప్లవోద్యమ

నాయకురాలు సీతక్క

నివాళులర్పించిన మాస్‌లైన్‌ నేతలు

ఖమ్మంమయూరిసెంటర్‌: దాదాపు 30 ఏళ్ల పాటు అడవిలో సాయుధ సభ్యురాలుగా పనిచేసిన గంగసాని సీతక్క(సరోజిని) విప్లవోద్యమ నాయకురాలు అని మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పేర్కొన్నారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందగా ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నివాళులర్పించారు. అనంతరం రంగారావు మాట్లాడుతూ సీతక్క సీని యర్‌ నేత ధర్మన్న జీవిత సహచరి కాగా, 15 ఏళ్లుగా అనారోగ్యం, వృద్ధాప్య కారణాలతో బయట ఉంటున్నారని తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి సీ.వై.పుల్లయ్య, నాయకులు సభ్యులు జి.రామ య్య, ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్‌, సీహెచ్‌.శిరోమణి, టీ ఝాన్సీ, పి శోభ, శివకుమార్‌, కొత్తపల్లి రేణుక, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాయల రవికుమార్‌, న్యాయవాది కందాల క్రాంతికుమార్‌తో పాటు పోటు శ్రీనివాస్‌, గంగసాని కృష్ణ, రమాదేవి తదితరులు కూడా సీతక్క మృతదేహం వద్ద నివాళులర్పించారు.

గురుకులంలో

ఎలుకల కాటు

ఆరుగురు విద్యార్థినులకు గాయాలు

సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం అడవిమల్లెలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అడవిమల్లెలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల హాస్టల్‌లో నిద్రిస్తు న్న ఆరుగురు విద్యార్థినులను సోమవారం రాత్రి ఎలుకలు కరిచాయి. విద్యార్థినులు మంగళవారం ఈ విషయాన్ని చెప్పడంతో లంకాసాగర్‌ పీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయించారు. అయితే, గురుకుల హాస్టల్‌లో ఎలుకల బెడద కొత్తేమీ కాదని, గతంలోనూ పలువురిని కరిచినా నివారణ చర్యలు చేపట్టలేదని విద్యార్థినులు ఆరోపించారు. ఎలుకల భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement