జూలూరుపాడు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని పడమటనర్సాపురం డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయానికి చెందిన బాదావత్ హనుమంతరావు – కవిత కుమారుడు ఈశ్వర్(16) సోమవారం అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. పడమటనర్సాపురం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం వద్ద రాష్ట్రీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఆయ న పదోతరగతి పాసై ఇంటర్‌లో చేరేందుకు సిద్ధమవుతుండగా మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
6.1 కేజీల గంజాయి స్వాధీనం
టేకులపల్లి: ఏపీ – ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి రవాణా చేస్తున్న గంజాయిని జిల్లా ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అధికారులు టేకులపల్లి శివార్లలో తనిఖీ చేస్తుండగా ద్వి చక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని తనిఖీ చేయగా రూ.3,05,000 విలువైన 6.1 కేజీల గంజా యి పట్టుబడింది. నిందితులు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం రాజు క్యాంప్‌కు చెందిన కొర్ర డేనియల్ కుమార్, కిలో సాగర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో ఎస్‌ఐ గౌతమ్‌తో పాటు ఉద్యోగులు నరసింహరావు, శ్రీనివాసరావు, పార్థసారథి, రమేష్ పాల్గొన్నారు.
మద్యం మత్తులో విధులకు హెచ్‌డబ్ల్యూఓ
ములకలపల్లి: వుులకలపల్లి ఎస్సీ బాలుర వసతి గృహం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్‌డబ్ల్యూఓ) మద్యం మత్తులో విధులకు హాజరైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హెచ్‌డబ్ల్యూఓ కిషన్‌ప్రసాద్ మద్యం సేవించి డ్యూటీకి వచ్చినట్లు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అంతేకాక ఆయనను ప్రశ్నించగా తాను కొద్దిగా మద్యం సేవించానని అందులో చెప్పడం గమనార్హం. ఈక్రమాన హాస్టల్‌ను మంగళవారం పాల్వంచ ఏఎస్‌డబ్ల్యూ అక్షయ్ తనిఖీ చేశారు. పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.


