‘పీఎం విశ్వకర్మ’తో చేతివృత్తుల అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

‘పీఎం విశ్వకర్మ’తో చేతివృత్తుల అభివృద్ధి

Aug 12 2026 12:34 AM | Updated on Aug 12 2026 12:34 AM

చుంచుపల్లి: చేతి వృత్తుల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం విశ్వకర్మ పథకం దోహదపడుతుందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ తెలిపారు. కొత్తగూడెంలో మంగళవారం ఏర్పాటుచేసిన ఉమ్మడి జిల్లా లబ్ధిదారుల సదస్సుకు జిల్లా కోఆర్డినేటర్‌ ఆకుల నాగేశ్వరరావు గౌడ్‌ అధ్యక్షత వహించగా మాజీ ఎంపీ మాట్లాడారు. దేశంలోని చేతి వృత్తుల వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పీఎం మోడీ పీఎం విశ్వకర్మ యోజనను ప్రవేశపెట్టారని తెలిపా రు. భారతపౌరులై ఉండి, సంప్రదాయ చేతి వృత్తుల్లో నైపుణ్యం కలిగిన వారికి శిక్షణ, పనిముట్లు, రుణ సదుపాయాలు అందుతాయని చెప్పారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడగా.. బీజేపీ పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్‌, నాయకలు పైడిపాటి రవీందర్‌, సీతారాంనాయక్‌, శ్రీనివాస్‌, రాయుడు నాగేశ్వరరావు, నరసింహారావు, కనుకుంట్ల రాజమౌళి, క్రాంతి, భూక్య రాజేష్‌నాయక్‌, గూడ విజయ, భూక్యా పూర్ణ, గుమలాపురం సత్యనారా యణ, ఆదిమూల రాములు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement