హర్‌ ఘర్‌ తిరంగా ! | - | Sakshi
Sakshi News home page

హర్‌ ఘర్‌ తిరంగా !

Aug 12 2026 12:34 AM | Updated on Aug 12 2026 12:34 AM

చుంచుపల్లి/కొత్తగూడెం అర్బన్‌: పెద్దసంఖ్యలో విద్యార్థులు జాతీయ జెండాలు చేబూని కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. బీజేపీ ఆధ్వర్యాన ’హర్‌ ఘర్‌ తిరంగా’ పేరుతో ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ జెండాలతో పాల్గొనగా పోస్టాీఫీస్‌ సెంటర్‌ వద్ద మొదలై ప్రకాశం బస్టాండ్‌ సెంటర్‌, సూపర్‌బజార్‌, గణేష్‌టెంపుల్‌, ఓల్డ్‌ డిపో, గోధుమవాగు మీదుగా లక్ష్మీదేవిపల్లి వరకు కొనసాగింది. ర్యాలీ జరుగుతున్న సమయాన ఎక్కడ కూడా ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా వాహనదారులు స్వచ్ఛందంగా దారి ఇచ్చి దేశభక్తిని చాటుకోవడం విశేషం. తొలుత ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కిసాన్‌మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. దేశభక్తిని చాటడమే కాక వికసిత భారత్‌, ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌ సంకల్పాన్ని చాటిచెప్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. నాయకులు జాటోత్‌ వెంకన్న నాయక్‌, భోగి కృష్ణ, బిక్షపతి, గోపి, కోల హరీష్‌, నరేష్‌,పుణ్యా నాయక్‌, మురళి, చెరుకు భాగ్యలక్ష్మి, భూక్యా దివ్యశ్రీ, సముద్రాల గాయత్రి, భూక్య స్వాతి, దుర్గా శ్రీనివాసరావు, గుమలాపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ ఆధ్వర్యాన భారీ ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement