గుండెపోటుతో మహిళా రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో మహిళా రైతు మృతి

Aug 11 2026 12:24 AM | Updated on Aug 11 2026 12:24 AM

గుండాల: గుండెపోటుతో ఓ మహిళ రైతు మృతి చెందిన ఘటన మండలంలోని శంభుని గూడెం గ్రామంలో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుంజా రాంబాయి (48) ఉదయాన్నే లేచి చేను పనికి వెళ్లింది. సాయంత్రం రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి వెతకగా చెట్టు కింద విగత జీవిగా పడిఉంది. గుండెపోటు వచ్చి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలం క్రితం భర్త చనిపోవడంతో అన్ని తానై వ్యవసాయం చేస్తూ ముగ్గురు ఆడ పిల్లలను పెంచి పెళ్లిళ్లు చేసింది. తండ్రి లేకపోగా చిన్నప్పటి నుంచి కష్టాలు పడి సాకిన తల్లి చనిపోవడంతో కూతుళ్లు కన్నీరు మున్నీరుగా రోదించారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేయాలని గ్రామస్తులు కోరారు.

నార్కట్‌పల్లిలో

రామవరం యువకుడు..

రుద్రంపూర్‌: నార్కట్‌పల్లిలో ఆదివారం బైక్‌ ఢీకొని కొత్తగూడెం 15 డివిజన్‌(రామవరం)కు చెందిన యువకుడు దొంతుల నిఖిల్‌(24) మృతి చెందాడు. వివరాలు ఇలా.. రామవరానికి చెందిన రతన్‌ కొత్తగూడెంలో గ్యాస్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాల కోసం తండ్రికి ఆసరాగా ఉండేందుకు నిఖిల్‌ నార్కట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం పనికి వెళ్లివస్తున్న క్రమంలో ప్రమాదం జరిగి మృతి చెందాడు. నార్కట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, నల్లగొండ ప్రభుత్వఆస్పత్రిలో సోమవారం పోస్టమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement