కొత్త గనులు ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

కొత్త గనులు ఏర్పాటు చేయాలి

Aug 11 2026 12:24 AM | Updated on Aug 11 2026 12:24 AM

● సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా ● చైతన్య యాత్రకు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం సంఘీభావం

● సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా ● చైతన్య యాత్రకు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం సంఘీభావం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/టేకులపల్లి: టేకులపల్లి ప్రాంతంలో నూతన బొగ్గు భూగర్భ గనులు తక్షణమే ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా డిమాండ్‌ చేశారు. జిల్లా సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర సోమవారం ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టేకులపల్లి సభ నిర్వహించారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలం, కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి కార్మికప్రాంతాల్లో యాత్ర కొనసాగింది. ఆటా పాటలతో ఉత్సాహంగా యాత్ర సగగా, సీతారాంపురం, లాలుతండా, కారుకొండ, రైల్వే స్టేషన్‌ సెంటర్‌, ఎంజీ రోడ్డు, భజనమందిర్‌ రోడ్‌, సింగరేణి హెడ్డాఫీస్‌, ఎస్‌సీబీ నగర్‌, రామవరం, 3 ఇంకై ్లన్‌, 4 ఇంకై ్లన్‌, రుద్రంపూర్‌, గౌతంపూర్‌, పెనగడప సెంటర్లలో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు సాగుదారులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించాలని సూచించారు. కొత్తగూడెం ప్రాంత అభివృద్ధిని గాడిలో పెట్టింది సీపీఐ మాత్రమేనని అన్నారు. పంటరుణాలు, రైతు భరోసా రాకపోవ డం వల్ల అంబసత్రం రైతులు అవస్థలు పడుతున్నారని అన్నారు. కొత్తగూడెంలో క్రమబద్ధీకరణ జీఓ 76ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పొజిషన్‌ సర్టిఫికెట్లు జారీచేయాలని కోరారు. కాగా, టేకులపల్లి సభకు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరై సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, మేయర్‌ మూడ్‌ గణేష్‌, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, వాసిరెడ్డి మురళి, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు మచ్చా శ్రీనివాస్‌, గుగులోత్‌ రామ్‌చందర్‌, నాగార్జునాచారి, డేగల రమేష్‌, గుగులోత్‌ సోని, జయమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement