ఆపన్నహస్తం అందించరూ.. | - | Sakshi
Sakshi News home page

ఆపన్నహస్తం అందించరూ..

Aug 10 2026 12:22 AM | Updated on Aug 10 2026 12:22 AM

పాల్వంచరూరల్‌: రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చి గిరిజన విద్యార్థులకు వాలీబాల్‌ కోచ్‌గా పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో ఎడమ తొడ ఎము క, కుడిచేతి మణికట్టు, నోటి దవడ ఎముకలు విరిగాయి. శస్త్రచికిత్సకు అవసరమైన ఖర్చులకు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నా డు. పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన జి.వాసు పాల్వంచ మండలం కిన్నెరసాని మోడల్‌ స్పోర్ట్స్‌ స్కూల్లో వాలీబాల్‌ కోచ్‌గా 2023 నుంచి పనిచేస్తున్నాడు. ఆయన శిక్షణలో విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించారు. ఆయన గత మంగళవారం కొత్తగూడెం నుంచి పాల్వంచ బైక్‌పై వస్తుండగా కలెక్టరేట్‌ వద్ద లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి కొత్తగూడెంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్సకు ఆర్థిక స్థోమత లేక దాతలు సాయం చేయాలని కోరుతున్నాడు. సాయం అందించాలనుకునేవారు.. ఎస్‌బీఐ: జి.వాసు ఖాతా నంబర్‌ 20201293986, సీఐఎఫ్‌ నంబర్‌ 87060945729, ఐఎఫ్‌ఎస్‌సీ నంబర్‌: ఎస్‌బీఐఎన్‌0016563 లేదా.. 90926 54891 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

చోరీకి గురైన బైక్‌లు లభ్యం

గుర్తించిన స్థానికులు

భద్రాచలంఅర్బన్‌: చోరీకి గురైన ద్విచక్రవాహనం కోసం వెతుకుతుండగా.. మూడు బైక్‌లు దొరికిన ఘటన భద్రాచలం సరిహద్దులోని వెంకట్‌రెడ్డిపేట వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పోయిన బైక్‌ కోసం బాధితులు వెతుకుతుండగా మూడు బైక్‌లు కపించాయి. అక్కడ ఇద్దరు యువ కులు ఉండగా స్థానికులు ప్రశ్నించడంతో పరారయ్యారు. స్థానికులు ఆ యువకుల ఫొటోలను తీశారు. మూడు బైక్‌ల్లో ఒకటి భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి మూలమలుపు వద్ద చోరీకి గురికాగా.. మరో బైక్‌ ఆదర్శ్‌నగర్‌కాలనీకి చెందిన వ్యక్తికి చెందినదిగా తెలిసింది. మూడోది ఎవరిదనే విషయం తెలియాల్సి ఉంది.

బాబూక్యాంపులో

పట్టపగలే చోరీ

చుంచుపల్లి: వైద్య పరీక్షల కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ వెళ్లిన సమయాన్ని అదనుగా చేసు కున్న దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి పట్టపగలే చోరీకి పాల్పడిన ఘటన చుంచుపల్లి మండలం బాబూక్యాంపులో ఆదివారం చోటుచేసుకుంది. బాబూక్యాంప్‌లో నివాసముండే ఖాజా బేగం కూతురితో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లారు. దుండగులు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాను ధ్వంసం చేసి నాలుగు నాలుగు గ్రాముల బంగారు చెవి దిమ్మలు, ఎనిమిది గ్రాముల వెండి పట్టీలు, 10 గ్రాముల సిల్వర్‌ కాయిన్‌ అపహరించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. కుటుంబ సభ్యులు చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏపీలో చోరీ..

తెలంగాణలో పట్టుబడి..

ములకలపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బంగారు గోలుసు చోరీకి పాల్పడి కారులో పరారవుతుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని తిమ్మంపేట శివారులో స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉడండం గమనార్హం. స్థానికుల కథనం మేరకు.. కుక్కునూరు మండలం గుండబోరు గ్రామ శివారులో ఆదివారం ఓ మహిళ మెడలో చైన్‌ లాక్కొని, కొందరు వ్యక్తులు కారులో తెలంగాణ వైపు పరారయ్యారు. దీంతో అక్కడి స్థానికులు అటుగా ఉన్న తెలంగాణ గ్రామస్తులకు విషయాన్ని తెలిపారు. తిమ్మంపేట వైపు కారు వస్తుందన్న సమాచారంతో స్థానిక సర్పంచ్‌ తుర్రం శ్రీను, గ్రామస్తులు రహదారిపై ఆటోను అడ్డుగా పెట్టారు. ఆటోను సైతం ఢీకొట్టి దొంగలు తప్పించునే ప్రయత్నం చేసేలోగానే స్థానికులు వారిని పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ములకలపల్లి ఎస్‌ఐ మధుప్రసాద్‌ ఘటనాస్థలికి చేరుకుని, నిందితులను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐని వివరణ కోరగా.. ఘటన ఆంధ్రాలో చోటుచేసుకుందని, నిందితులను కుక్కునూరు పోలీసులకు అప్పగించామని తెలిపారు.

రేషన్‌ బియ్యం

లారీ పట్టివేత

భద్రాచలంఅర్బన్‌: అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని భద్రాచలంటౌన్‌ పోలీసులు పట్టుకున్నారు. జగ్గయ్యపేట నుంచి భద్రాచలం మీదుగా ఒడిశాలోని కొరాపుట్‌కు లారీలో పీడీఎస్‌ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి, లారీడ్రైవర్‌, క్లీనర్‌, యజమానితో పాటు మహబూబాబాద్‌కు చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement