గుండాల/ఇల్లెందు: ప్రజలు, రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వారినే మోసం చేస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా పేర్కొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర గుండాల, ఆళ్లపల్లి, ఇల్లెందు మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించగా.. సాబీర్‌పాషా మాట్లాడారు. ఎరువులు, నిత్యావసర సరుకుల ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని, సకాలంలో ఎరువులు ఇవ్వకుండా యాప్‌ల పేరుతో జాప్యం చేస్తున్నారని, ఏజెన్సీలో సిగ్నల్ సమస్యతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆయా మండలాల సహజ వనరులైన ఇసుక ను స్థానిక ప్రజలే వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని కొమరంభీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళలర్పించారు. ఇల్లెందులో యూనియన్ నేత కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు మత్యాల విశ్వనాథం, సరెడ్డి పుల్లారెడ్డి, నరాటి ప్రసాద్, రేసు ఎల్లయ్య, ఉప్పుశెట్టి రాహుల్, చంద్రగిరి శ్రీనివాస్, పూర్ణచందర్రావు, మున్నా లక్ష్మీకుమారి, నిమ్మల రాంబాబు, భూక్యా శ్రీను, కొమరం హనుమంతరావు, గొగ్గెల కృష్ణ, వజ్జ ఉమ, వాగబోయిన రమేశ్, సాహెబ్, షాహెద్, బచ్చల రామయ్య, కె.సారయ్య, బాస శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.


