భద్రాచలంటౌన్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ తెలిపారు. శనివారం ఆయన గిరిజన భవనం, ఆదివాసీ మహనీయుల విగ్రహాల వద్ద ఏర్పాట్లను, భోజన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాది కంటే ఈసారి ప్రముఖులు, గిరిజనులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ, గిరిజన భవనంలో నిర్వహించే కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. తాగునీరు, పార్కింగ్, భోజన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ మధుకర్, ఏఓ సున్నం రాంబాబు, టీఏ శ్రీనివాస్, ఏటీడీఓ రాధమ్మ, డీఎస్వో ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.


